//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు .. బడ్జెట్ ప్రవేశపెట్టేది ఆయనేనా

Category : state politics

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కు సంబంధించి ఇప్పటికి డైలమా వీడలేదు. పంచమి రోజున మంచిదని మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్న అధికారికంగా ఏ విధమైన ప్రకటన చేయలేదు టిఆర్ఎస్ పార్టీ. ఇకపోతే తెలంగాణా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2019 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఇందుకోసం ఆర్ధిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కనుక కేబినెట్ విస్తరణ జరిగితే ఆర్ధిక మంత్రి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశ పెడతారు. లేని పక్షంలో సీఎం కేసీఆరే స్వయంగా బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో జలగం వెంగళరావు వంటి వారు సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కనుక సీఎం హోదాలో కేసీఆర్ బడ్డెట్ ప్రవేశపెడతారు కావచ్చు.

పార్టీ వర్గాల్లో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి సీఎం మనసులో ఏముందో ..ఎందుకు మంత్రివర్గ విస్తరణ విషయాల్లో జాప్యం చేశారో, అదే సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తారో లేదో, ఒకవేళ చేయకుంటే తానే బడ్జెట్ ను ప్రవేశపెడతారా అన్న సందేహాలు గులాబీ పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

Related News