//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాదయాత్ర కు బ్రేక్, సిబిఐ కోర్టుకు జగన్..!

Category : politics

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు.

ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్‌ జనవరి 20న కోర్టులో వాదనలు వినిపించారు.జనవరి 26 వతేది రిపబ్లిక్ డే సందర్భంగా కోర్టుకు సెలవుకు కావడంతో జగన్ కోర్టుకు రాలేదు.

ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 77వ రోజు పొదలకూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిఉన్నందున పాదయాత్రకు జగన్ విరామం ప్రకటించారు. తిరిగి శనివారం మరుపూరు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు.