//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ బయోపిక్ వాయిదా .....అసలు కారణం ఇదే ...!

Category : movies

సీఎం , ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవితంలోని అన్ని అపూర్వ ఘట్టాలను తెరపై చూపించేందుకు రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ బయోపిక్' తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. చిత్రంలో తన తండ్రి పాత్రను బాలకృష్ణ చేస్తున్నాడు . అలాగే నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు . ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ సినీలోకాన్ని సర్‌ప్రైజ్ చేస్తోంది. ఎన్టీఆర్ జీవితంలోని సినీ విశేషాలకు దృశ్య రూపం కల్పిస్తూ ‘కథానాయకుడు’గా మొదటి భాగం జనవరి 9న, రాజకీయ జీవితంలోని విశేషాలకు దృశ్య రూపం కల్పిస్తూ ‘మహానాయకుడు’గా రెండో భాగాన్ని జనవరి 24న ప్రేక్షకుల ముందుంచేందుకు ప్లాన్ చేశారు క్రిష్.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు రెండో భాగం ‘మహానాయకుడు’ను వాయిదా వేస్తున్నారట క్రిష్. రెండు భాగాల మధ్య కాస్త గ్యాప్ ఎక్కువగా ఉంటేనే థియేటర్స్ కొరత ఉండదని ఆయన భావిస్తున్నారని టాక్. భారీ ఎత్తున అత్యధిక థియేటర్స్‌లో ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కానుంది కాబట్టి , మొదటి భాగంతోనే థియేటర్స్ ఫుల్ అయిపోతాయని, కేవలం 15 రోజులే గ్యాప్ ఉంటే రెండో భాగానికి పెద్ద మొత్తంలో థియేటర్స్ దొరికే ఛాన్సెస్ ఉండవని ఆయన ఆలోచిస్తున్నారట.

దీనితో ‘మహానాయకుడు’ను కాస్త వాయిదా వేసి ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట క్రిష్ . ఎన్టీఆర్ రాజకీయ వైభవాన్ని చూపించేందుకు ‘మహానాయకుడు’ నిడివి కూడా చాలా ఎక్కువగా ఉండేలా క్రిష్ కసరత్తులు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. చుడై మారి ఎన్టీఆర్ బయోపిక్ ఇండస్ట్రీ లో ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో ..