//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రాండ్ బాంబు ల బాబు...మారుతీ..

Category : movies

సుమ‌త్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ, ముర‌ళీశ‌ర్మ ప్ర‌ధాన పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌.ఎస్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాక‌ర్.పి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శైలేంద్ర‌బాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. ఈ సినిమాకి మారుతీ. కథ అందించాడు.

ఎదుటోడి ఒంటిమీద బ్రాండ్ కనబడక పోతే అతడి నోటి నుండి మాట కూడా రాదు, తాగే వాటర్ నుండి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వస్తువే అయుండాలి..... అనేది హీరో క్యారెక్టరైజేషన్‌. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆమె బ్రాండెడ్ వస్తువులంటే కూడా తెలియని పేద అమ్మాయి అని తెలిసి షాకవుతాడు.

ఊర్లో ఉన్న దరిద్రం అంతా ఈవిడ దగ్గరే ఉందని ఫీలైన హీరో చివరకు ఆమె ప్రేమలో ఎలా పడ్డాడు అనేది సినిమా మూల కథ అని తెలుస్తోంది.హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ మారుతి చాలా సింపుల్‌గా క‌థ రాస్తాడు. అందుకే నాకు త‌నంటే విప‌రీత‌మైన గౌర‌వం. మారుతి తొలి సినిమా స‌క్సెస్ కాగానే, త‌న చుట్టుప‌క్క‌నున్న వారి స‌క్సెస్ గురించి ఆలోచించాడు.

ప్ర‌భాక‌ర్‌ ఎప్పుడూ బిజీ ప‌ర్స‌న్‌. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ నువ్వే సినిమాతో మంచి టెక్నీషియ‌న్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. మ‌నం చేయాల‌నుకున్న ప‌ని చేయ‌డ‌మే స‌క్సెస్‌.

అది న‌లుగురికీ న‌చ్చ‌డం బోన‌స్‌. హీరో చాలా బాగా చేశాడు అని అన్నారు..జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ సినిమాను ముందుకు తీసుకొస్తున్నాడంట ..చిన్నగా,కొత్తగా సినిమాలు ఇచ్చే మారుతీ అన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు ఏది కూడా అదే కోణంలో ఉందని చెప్తున్నారు...