Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

50 ఏళ్ల వయసులో అర్ధ నగ్న ప్రదర్శనతో ....పిచ్చెక్కిస్తున్న హాలీవుడ్ హాట్ హీరోయిన్

Category : movies

గ్లామర్ వరల్డ్ లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి.లేదంటే మూటా ముల్లే సర్దు కుని ఇంటి కెళ్ళాలి . అందుకే ఈ గ్లామర్ ప్రపంచంలో చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడే ఏదైనా సాధించాలి, ఇంకేదైనా చేదించాలి..ఒక్కసారి వయసు పెరిగాక అవకాశాలు తగ్గిపోయాక చేయడానికి ఇంకేం ఉండదు.ఈ విషయం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన అందాల తారలకు వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసు ఉండగానే హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ,వాటి ద్వారా వచ్చే ఆఫర్స్ నీ క్యాష్ చేసుకుంటు ఉంటారు. మూవీస్ లో హాట్ హాట్ గా కనిపిస్తూనే అవకాశాలు దక్కించుకుంటారు. ఈ విషయం టాలీవుడ్ కంటే హాలీవుడ్ హీరోయిన్లకే బాగా తెలుసు. జెన్నిఫర్ అగస్టీన్ టీవీ సీరియల్స్ ద్వారా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ అమ్మడు హాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో బ్రాడ్ పిట్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

ఆ తరువాత కొంతకాలానికి ఈ ఇద్దరు విడిపోయారు అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఈ భామ వయసు అక్షరాల 50 యేళ్లు. ఈ వయసులో కూడా ఈ అమ్మడు చాలా అందంగా,చురుగ్గా ఉంది. అంతేకాదు హర్పర్స్ బజార్ అనే ప్రముఖ మ్యాగజైన్ కోసం ఏకంగా ఈ అమ్మడు టాప్ లెస్ ఫోటో షూట్ చేసి అక్కడి జనాలను పిచ్చెక్కిచింది. ఎద అందాలను చేత్తో కవర్ చేస్తూ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఫొటోస్ కు లక్షలాది మంది అభిమానులయ్యారు. రీసెంట్ గా 50 వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు హాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు తన మాజీ భర్త బ్రాడ్ పిట్ నీ కూడా ఆహ్వానించింది.

పిట్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఏంజలీనా జోలీతో విడాకులు తీసుకున్నాక ఈ హీరో ఒంటరిగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పిట్ మళ్లీ జెన్నిఫర్ ను వివాహం చేసుకోబోతున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే.