//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కరీంనగర్ లో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు మృతి చెందిన ప్రియురాలు

Category : state

కరీంనగర్ టౌన్ లో దారుణం. ప్రేమించలేదని ఓ యువతి కొంతుగోసి చంపాడు ఓ యువకుడు. పట్టణ నడిబొడ్డున కలెక్టరేట్ ఎదుట ఈ కిరాతకం జరిగింది. యువతి మీ-సేవ కేంద్రంలో పని చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 15వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో.. మీ సేవ కేంద్రంలో పనిచేస్తున్న రసజ్ఞ అనే యువతిని.. వంశీధర్ అనే యువకుడు గొంతు కోశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడ. ఆ వెంటనే.. వంశీధర్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకున్న స్థానికులు వంశీధర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు వంశీధర్, మృతురాలు రసజ్ఞ ఇద్దరూ గోదావరి ఖని ప్రాంతానికి చెందినవారే. కొన్నాళ్లుగా రసజ్ఞను ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. యువతి మాత్రం నిరాకరించింది. వెంటపడొద్దని చెప్పింది. అయినా వినని వంశీధర్ వేధిస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో రసజ్ఞ పని చేస్తున్న మీ-సేవ కేంద్రానికి వచ్చాడు. మాట్లాడాలని ఒత్తిడి చేశాడు.

దీంతో ఆమె కేంద్రం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే యువతి గొంతుకోశాడు. గిలగిలి కొట్టుకుంటూ యువతి రోడ్డుపై పడింది. ప్రేమ వ్యవహారమే కారణం అని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.