//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీరియల్ ని అనుకరించ బోయి బాలుడు మృతి

Category : editorial

చిన్న‌, పెద్ద తేడా లేకుండా ఇపుడు అందరి పై సీరియ‌ళ్ల ప్ర‌భావం విప‌రీతంగా ఉంటుంది.

ముఖ్యం గా చిన్న పిల్ల‌లపై సీరియ‌ళ్ల ప్ర‌భావం ఎక్కువగా ఉంటుంది. సీరియల్ లో వచ్చే చిన్న.. చిన్న.. సన్నివేశాలలోని నటులు గా ఉహించుకోవడాన్ని బాగా ఆసక్తి కనబరుస్తారు. వారిని అనుక‌రించ‌డానికి వారు చాలా ఆస‌క్తి చూపిస్తారు. ఇలాంటివి ఇంట్లో ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని ఆయా సీరియ‌ళ్ల టైటిల్స్ లో హెచ్చ‌రిక‌లు వేస్తున్నప్పటికీ, వారు వినిపించుకోరు.

అసలు వివరాల్లోకి వెళ్తే... రెండు నెల‌ల క్రితం ఓ బాలిక, సీరియ‌ళ్ల ప్ర‌భావంతో త‌న‌ను తాను ద‌హించివేసుకున్న సంగ‌తి తెలిసిందే. దానిని మర్చిపోక ముందే మ‌ళ్లీ ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల బాలుడు సీరియ‌ల్‌లో పాత్ర‌ను అనుక‌రించ‌బోయి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల రంజిత్ మ‌హాకాళి సీరియ‌ల్‌లో ఓ స‌న్నివేశాన్ని అనుక‌రించి చూపిస్తాన‌ని త‌న చెల్లి గుంజ‌న్‌, మ‌రో స్నేహితుడితో చెప్పాడు.

ఆ స‌న్నివేశంలో అమ్మ‌వారి నాలుక బ‌య‌టికి వ‌చ్చి ఉంటుంది. అలా త‌న నాలుక కూడా వీలైనంత మేర బ‌య‌టికి తీయ‌డం కోసం చున్నీని మెడ‌కు చుట్టుకున్నాడు. దీంతో ఉరి ప‌డి, ఊపిరాడ‌క గిలగిల కొట్టుకున్నాడు. అక్క‌డే ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లూ బ‌య‌టికి వెళ్లి పెద్ద‌వాళ్ల‌కు చెప్పి, వాళ్లు సంఘ‌ట‌న స్థలానికి వ‌చ్చేస‌రికే రంజిత్ ప్రాణాలు కోల్పోయాడు.

గ‌తంలో కూడా రంజిత్ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌బోయాడ‌ని, అప్పుడు అత‌ని త‌ల్లి గ్ర‌హించి ఆపిన‌ట్లు తెలుస్తోంది. సీరియల్ ని అనుకరిస్తూ ఆ చిన్న పిల్లాడి ప్రాణం పోగొట్టుకున్నాడు . ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లల మీద ఒక్క కన్ను వేసి ఉంచాలిసిందే లేకపోతె ఇలాంటి గోరాళ్లు ఇక ఎన్నో చుడాలిసి ఉంటుంది . లేక చిన్న పిల్లలని సీరియల్ కి దూరం గా ఉంచాలిసి ఉంటుంది.

Related News