//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

Category : national

సోమవారం రాత్రి తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తాజ్‌గంజ్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తాజ్‌మహల్ వద్ద బాంబు పెట్టామని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తాజ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం అక్కడ బాంబు లేదని.. ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించారు. తాజ్‌మహల్ ఆవరణలో సోమవారం.. శివ చాలీసా పారాయణం చేసిన కొద్దిసేపటికే బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రాష్ట్రీయ స్వాభిమాన్‌ దళ్‌, హిందూ యువ వాహని కార్యకర్తలు శివనామ స్మరణ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే తాజ్‌కు భద్రత కల్పించే సీఐఎస్‌ఎఫ్‌ దళాలు.. ఆ రెండు వర్గాల కార్యకర్తలను అరెస్టు చేసి..

ఆ తర్వాత విడుదల చేశారు. ఆర్‌ఎస్‌డీకి చెందిన దీపక్‌ శర్మ నేతృత్వంలో ఈ శివ పారాయణం సాగింది. తాజ్‌ మొదట్లో శివాలయమని, సోమవారం రోజున శివున్ని ఆరాధిస్తామని ఆయన అన్నారు. తేజోమాలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని మొఘల్‌ రాజులు నేలకూల్చి..ఇక్కడే తాజ్‌ను నిర్మించారన్నారు. తాజ్‌ను దేశద్రోహులు నిర్మించాలని ఇటీవల యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Related News