//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు : సీక్రెట్ గా ఉంచిన పోలీసులు ?

Category : national

జీఈఎస్‌ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్‌ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చింది. ఫలక్‌ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో పోలీసులు నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్‌ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ నిన్న అక్కడే బస చేయడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.