//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లైంగిక వేదింపులతో బాధ పడుతున్న బాలీవుడ్ నటి

Category : movies

అమ్మాయి ల లైంగిక వేధింపులు ఇప్పుడు ఎక్కడైనా సర్వసాధారణం గా మారాయి. మొన్నటి వరకు టాలీవుడ్ లో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంత ఇంత కాదు. శ్రీరెడ్డి విషయం పై మొత్తం టాలీవుడ్ నే కుదిపేసింది.

ఇప్పుడు ఇదే విషయం పై ప్రముఖ బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. పనిప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై బాలీవుడ్ ప్రముఖ నటి హుమా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పని ప్రదేశాల్లో మహిళలకు లైంగికవేధింపులు లేని సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముందని హుమా ఖురేషీ అభిలషించారు. మోడలింగ్ రంగం నుంచి వెండి తెరకు వచ్చిన ఈ ఢిల్లీ సుందరి 2012లో బాలీవుడ్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.

కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురైన బాధితులనే బెదిరించడం, వారిని అపరాధులుగా చూడటం తగదని ఆమె కోరారు. తాను స్త్రీవాదినని చెపుతూ పురుషులతో సమానంగా మహిళలు కలిసి పనిచేసే పరిస్థితులు సృష్టించాలని హుమాఖురేషీ సూచించారు.

చిత్రపరిశ్రమలోనూ లింగసమానత్వం విషయానికి వస్తే తెర వెనుక ఎందరో మహిళలు దర్శకులుగా, కెమెరా ఉమెన్‌లుగా, టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, ఏక్ తీ దయాన్, జాలీ ఎల్ఎల్బీ 2 లాంటి పలు సినిమాల్లో బలమైన మహిళ పాత్రల్లో నటించిన హుమాఖురేషీ ప్రేక్షకుల ఆదరణ పొందారు.