//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ లో విడుదలైన బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో సరికొత్త వెర్షన్

Category : business

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 సిరీస్‌లో సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధరను రూ.49.9 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.61.3 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ముంబై షోరూంకు సంబంధించినవి. ఈ సరికొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభించనున్నది. డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు రూ.49.9 లక్షల నుంచి రూ.61.3 లక్షల మధ్యలో లభించనుండగా, పెట్రోల్ రకం రూ.49.9 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ మోడల్‌ను చెన్నైలో ఉన్న ప్లాంట్‌లోనే రూపొందించినట్లు బీఎండబ్ల్యూ గ్రూపు ప్రెసిడెంట్ విక్రమ్ తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతనే కొనుగోలుదారులకు ఈ కారును అందించనున్నట్లు ఆయన చెప్పారు. పదేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన సంస్థ ఇప్పటి వరకు 66 వేల యూనిట్లను విక్రయించింది. దీంట్లో 19 వేల యూనిట్లు సిరీస్-5కి చెందినవి కావడం విశేషం. గత వెర్షన్‌తో పోలిస్తే ఈ కారు 70 కిలోల బరువు తక్కువగా ఉండనున్నది. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.130 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు.

BMW 5-series Prices (All price, ex-showroom and post GST)
BMW 5-Series 530i Sportline - Rs 49.90L
BMW 5-Series 520d Sportline - Rs 49.9L
BMW 5-Series 520d LuxuryLine - Rs 53.60L
BMW 5-Series 530d M Sport - Rs 61.30L