//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గౌరీ లంకేశ్ హత్యతో మోడీ 'బ్లాక్ నరేంద్రమోడీ' అయ్యాడు.

Category : national

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శుభాకాంక్షలు - అభినందనలు తెలియజేయడం మొదలుకొని సమస్యలు పరిష్కరించే అంశాల వరకు కూడా ఆయన సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే అలాంటి మోడీజీకి అదే ట్విట్టర్ వేదికగా కొత్త షాక్ మొదలైంది. ట్విట్టర్ లో గురువారం అనుహ్యంగా బ్లాక్ నరేంద్రమోడీ అంటూ ట్రెండ్ మొదలు అయ్యింది. ట్విట్టర్ లో నరేంద్రమోడీ అకౌంట్ ను కొందరు అన్ ఫాలో లేదా బ్లాక్ చేయటం మొదలుపెట్టారు. అసలు ఎందుకంత వ్యతిరేకత. ఈ అడుగులు వేయటానికి కారణం ఏమిటంటే బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యే అంటున్నారు.

భారత ప్రధాని నరేంద్రమోడీని ట్విట్టర్ లో అనుసరిస్తున్న వాళ్లందరూ ఒక్కొక్కరిగా ఆయన్ని బ్లాక్ చేస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ 'బ్లాక్ నరేంద్రమోడీ'ని ట్రెండ్ గా మార్చేశారు. దీనంతటికీ కారణం జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యగా తెలుస్తోంది. ఆమె హత్యకు గురైన తర్వాత నిఖిల్ దధీచీ అనే వ్యక్తి ఆమెకు తగిన శాస్తి జరిగిందని దీంతో మిగతా కుక్కలు కూడా నోరుమూసుకుంటాయని బూతులు ఉపయోగిస్తూ ట్వీట్ పెట్టాడు. ఈ వ్యక్తిని అనుసరిస్తున్న వారి జాబితాలో చాలా మంది రాజకీయనేతలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని కనిపెట్టిన సామాజికవాది డా. రాకేశ్ పారిఖ్ - పాత్రికేయుల హత్యకు నరేంద్రమోడీ మద్దతు పలుకుతున్నాడని - నిఖిల్ దధీచీ అకౌంట్ ను ప్రధాని అన్ ఫాలో చేసే వరకు ప్రధాని అకౌంట్ ను ఎవ్వరూ అనుసరించవద్దని ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో పాటే 'బ్లాక్ నరేంద్రమోడీ'ని ఉపయోగించాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ప్రధాని మోడీ అకౌంట్ ను అన్ ఫాలో చేసి బ్లాక్ చేయడం ప్రారంభినట్లు తెలుస్తోంది.