//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొచిన్ షిప్ యార్డ్‌లో పేలుడు ఐదుగురి దుర్మరణం...!

Category : state

కొచిన్ షిప్ యార్డ్‌లో మంగళవారం పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు. ఓఎన్‌జీసీకి చెందిన భుషణ్ షిప్‌లోని వాటర్ ట్యాంక్‌ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

కార్గో షిప్‌లోని నీటి ట్యాంకుల లోపలి వాతావరణం మంటలు వ్యాపించడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో వెంటనే వ్యాపించడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దర్ని గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరమ్మతులు జరుగుతోన్న నౌకలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.