Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోకేష్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకే

Posted 21 days ago | Category : national

దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేశారనే ఓ ప్రచారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

అర్దరాత్రి మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి పూజలు నిర్వహించారని పుకార్లు షికారవుతున్నాయి. పలు సమస్యలు ఏర్పడుతుండడంతో పూజలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారమని పలువురు సూచించడంతో పూజారి భద్రినాథ్ ఇతరుల సహాయం తీసుకుని అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారులు కొట్టిపారేస్తున్నారు.

రాష్ట్రపతి సతీమణి పర్యటన నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆలయంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధానికి వాడుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు.

పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారం నిలబెట్టుకునేందుకు వేల కోట్ల నల్లధనాన్ని ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆంగ్ల సంవత్సర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదని చెప్పారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని వేద పండితులు ఆశీర్వదించారని అన్నారు. ఒకవైపు జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని ఏ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చి, ఇంద్రకీలాద్రిపై మాత్రం లోకేష్ కోసం ఎలా పూజలు నిర్వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలకు నిబంధనల సడలింపు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు మతిస్థిమితం ఉందా? అని అనుమానం వస్తోందన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు.

అలాగే ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకపోతే ఓటర్లే సిగ్గుపడాలి..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడాన్ని కూడా అంబటి ప్రస్తావించారు. రాష్ట్రం కోసం కష్టపడుతున్నాను అని బాబు చెప్పుకొంటున్నారని.. అయితే తనయుడిని మంత్రిని చేసేందుకు ఆయన చాలా కష్టపడ్డారు అని రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను నిలబెట్టుకున్నారో చెప్పి తర్వాత ఓటు అడగాలన్నారు. చంద్రబాబు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే