Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఖైరతాబాద్ లో ఘర్షణ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

Category : politics state

నేడు ఓటర్లు తమ తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరికి ఓటరు దేవుళ్ళు పట్టం కట్టనున్నారో అని అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్ లో ఉంది. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి.

ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్ పోలింగ్‌బూత్‌లో బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌ పార్టీ కండువా ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి రావడంతో బీజేపీ కార్యకర్త ప్రదీప్ దానం నాగేందర్ ను ప్రశ్నించారు. పార్టీ కండువా కప్పుకుని ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో అతడిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్ళేటప్పుడు అభ్యర్థులకు సూచనలు చేసినా అవి పాటించటం లేదనే భావన వ్యక్తం అవుతుంది.