//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Category : politics

కేంద్ర బడ్జెట్ సమావేశాల పై టీడీపీ అన్యాయం జరిగిందని అనడం,రాజ్యసభలో ఒకరి పై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడం.బీజేపీ పై మండిపడటం.ఇవ్వాల్సిన నిధులు,హామీలు నెరవేర్చలేదు అని టీడీపీ అనడం.బీజేపీ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడం.బీజేపీతో సమైక్యత వద్దని ఒకసారి,మరొకసారి బీజేపీతో శాంతియుత చర్చలు జరపాలని,వాళ్ళు హామీలు నెరవేరుస్తారని,వారితో సమ్యక్యత సమ్మతమే అని టీడీపీ అనడం.ఇలా ఒకరి పై ఒకరు(బీజేపీ-టీడీపీ) చెప్పుకుంటూ ప్రజలను అయోమయం చేస్తున్నారు.

ఈ ఘటన పై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు అనడం,నిధులిచ్చామని బీజేపీ నేతలు చెబుతుండటంపై తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు విమర్శలు గుప్పించారు.ఆరు నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారని,టీడీపీ నేతలు,బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు,విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోయారని అన్నారు.

‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి మాట్లాడుతూ,ప్రజలను తికమకపెట్టొద్దు.విడిపోయి కొట్టుకోండి.రెండు ప్రభుత్వాల్లో (కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ) మీరే ఉంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు.టీవీ ఛానెల్స్ లో అల్లరి చేస్తారు.పేపర్లలో అల్లరి చేస్తారు.జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా.లేకపోతే,జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా.మీరు (బీజేపీ-టీడీపీ) ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి.నిజానిజాలు చెప్పండి.అదే నా కోరిక అని తమ్మారెడ్డి ఘాటుగా మాట్లాడారు.

Related News