Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల మేనిఫెస్టోను విడుల చేసిన బీజేపీ

Category : state politics

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. సంకల్ప్‌ పత్ర్‌ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు ప్రధాని మోదీ, జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఎన్నికల ప్రణాళికను తయారు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ బాలెన్స్‌ చేస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు. రైతాంగ సంక్షేమం, ప్రజారోగ్యం, దేశ భద్రత అంశాలకు బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రైతులకు ఏటా ఆరు వేల ఆర్థిక సాయంతో పాటు 60 ఏళ్లు నిండిన పేద రైతులకు పెన్షన్లు ఇస్తామని బీజేపీ ప్రకటించింది.

వ్యవసాయ రంగానికి 25 లక్షల కోట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తామని…2022నాటికి ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు మోదీ. ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ అంటూ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.

ఈ ఐదేళ్ల పాలన స్వతంత్ర భారతంలో సువర్ణాధ్యయంగా నిలిచిపోతుందన్నారు. అస్తవ్యవస్తమైన ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు అమిత్ షా.

Related News