//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ న‌యా ప్లాన్‌.. లీక్‌..!

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దేశంలోని ప‌రిచ‌యాలు కానీ, ఆయ‌న సామ‌ర్ధ్యాన్ని కానీ, ఎవ్వ‌రు కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేరు. మోడీకి 2003 నుంచి చంద్ర‌బాబుపై అయిష్ట‌త ఉన్న విష‌యం తెలిసిందే. కాక‌పోతే. ఆ విషయం ఈ మ‌ధ్య‌నే బ‌య‌ట‌ప‌డింది. ఎప్ప‌టికైనా మూడ‌వ ఫ్రెంట్‌తో బాబు ద్వారా ప్ర‌మాద‌మ‌ని గ‌మ‌నించి.. థ‌ర్డ్ ఫ్రంట్‌ను మొక్క‌గా ఉండ‌గానే తుంచేసేందుకు భారీ స్కెచ్ వేసిన మోడీ అమిత్ షా క‌లిసి భారీ స్కెచ్ వేశారు. గ‌త కొన్ని రోజులుగా ప‌వ‌న్‌తో మోడీ, షా ప్ర‌తినిధులు చీక‌టి చ‌ర్చ‌లు జ‌రిపార‌న్న సోష‌ల్ మీడియా క‌థ‌నాలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల్ని కేంద్ర పెద్ద‌ల‌కు చేర‌వేసేవార‌ని, ఏపీలో చీమ చిటుక్కుమ‌న్నా.. వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఢిల్లీలో చెప్పేవారంటూ వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏపీలో చంద్ర‌బాబు ఉన్నంత వ‌ర‌కు బీజేపీ బ‌ల‌ప‌డే స‌మ‌స్యే లేదు. పోల‌వ‌రం, అమ‌రావ‌తి పూర్తి చేస్తే మిగ‌తా పార్టీల వారికి కూడా ఇబ్బందే. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌కు అంత పెద్ద‌గా క‌లిసిరాక‌పోవ‌డంతో బీజేపీతో క‌లిసేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు సంవ‌త్స‌రం నుంచి బీజేపీతో ప‌వ‌న్ ట‌చ్‌లో ఉన‌న్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన బ‌ల‌ప‌డేందుకు ఆర్థికంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆదుకున్నాడ‌ని, దీనికి ప్ర‌తిఫ‌లంగా జ‌గ‌న్‌ను కేసుల నుంచి బ‌య‌ట ప‌డేసే బాధ్య‌త బీజేపీ తీసుకుంద‌ని స‌మాచారం. అలాగే, వియ‌సాయిరెడ్డి, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి లాంటి వారు ప‌వ‌న్‌కు ఆర్థిక‌సాయం అందించార‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన పొత్తు సంబంధాన్ని డిసెంబ‌ర్ 22న బ‌హిరంగంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని, అందుకోసం ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఈ స‌భ‌కు ప‌లువురు అగ్ర నేత‌లు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.