//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోవుల మధ్య బీజేపీ ఎం పి కుమారుడి పెళ్లి........!

Category : national

గోవు హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు.అలంటి గోవుల రక్షణ కొరకు బీజేపీ ఎంపి సరికొత్త గా అలోచించి అందరిని ఆకట్టుకున్నారు.వివరాలలోకి వెళ్తే,

గోవులన్నా వాటి పరిరక్షణ అన్నా మక్కువ చూపించే మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడైన అవినాశ్ రాయ్ ఖన్నా తన కుమారుడు పీయూష్ వివాహాన్ని స్వామి కృష్ణానంద్ నిర్వహిస్తున్న గోబింద్ గౌదాం గోశాలలో నిర్వహించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2,200 గోవులున్న ఈ గోశాలకు రంగులు వేయించి కుమారుడి పెళ్లిని వైభవంగా జరిపారు.

సంకీర్తనలు, సంగీతం మధ్య గోశాలలో జరిగిన పెళ్లి వేడుకకు పంజాబ్ రాష్ట్ర గవర్నరు వీపీ సింగ్, డీజీపీ సురేష్ అరోరా, పుదుచ్చేరి మాజీ లెప్టినెంట్ గవర్నరు ఇక్బాల్ సింగ్, కేంద్ర మంత్రులు విజయ్, జితేంద్రసింగ్, ఎంపీ సుఖ్ దేవ్ లతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోవుల రక్షణపై అతిధులకు అవగాహన కల్పించేందుకే తాను గోశాలలో తన కుమారుడి పెళ్లి చేశానని బీజేపీ నేత అవినాశ్ రాయ్ ఖన్నా సెలవిచ్చారు.