//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ ఎంపీ మృతి

Category : national

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌‌లోని కైరానాకు చెందిన బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ (79) కన్నుమూశారు.

శనివారం నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న హుకుం శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో అత్యవసర చికిత్స నిమిత్తం నోయిడా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన హుకుమ్.. రాష్ట్రంలో పలు ప్రభుత్వాల్లో పనిచేశారు. బీజేపీ ఎంపీ హుకుమ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. ‘ప్రముఖ నేత బీజేపీ ఎంపీ హుకుం సింగ్‌ను కోల్పోవడం చాలా బాధాకరం.

యూపీ ప్రజలకు ఎన్నో సేవలందించి రైతుల సంక్షేమం కోసం ఎంతోగాను ఆయన పాటుపడ్డారు’ అంటూ ట్వీట్ చేశారు. హుకుమ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న సమయంలో ఆయన్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే పరామర్శించినట్టు పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.