//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంగారం దొంగతన౦ చెయ్యమని సలహా ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే

Category : national politics

మరో బిజెపి ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను ఏకంగా బంగారం స్మగ్లింగ్ చెయ్యమని సలహా ఇచ్చి సంచలనం సృష్టించారు. రాజస్థాన్ లోని బిలారాలో దేవాసీ వర్గం నిర్వహించిన ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల వ్యసనం, అక్రమ రవాణా సమస్యలపై గార్గ్ మాట్లాడుతూ... డ్రక్స్ కేసుల్లో ఎంతమంది జోధ్‌పూర్‌ జైల్లో మగ్గుతున్నారనే దానిపై తాను అసెంబ్లీలో ప్రశ్నించానన్నారు.

‘‘నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ అమ్మకంలో బిష్ణోయిల రికార్డును దేవాసీ వర్గం మించిపోయింది. కాబట్టి చట్టవ్యతిరేక పనులన్నీ మానేయండి. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటికి రండి. దీనివల్ల యువతరం పెడదారి పడుతోంది...’’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ఆయన చేసిన ‘‘సూచనలే’’ వివాదాస్పదంగా మారాయి. ‘‘ఒకవేళ మీకు అక్రమ వ్యాపారం చేయాలని అనిపిస్తే.. బంగారం మీద చేయండి. ఈ రెండిటికీ ఒకే ధర ఉన్నప్పటికీ... డ్రగ్స్ కంటే బంగారం మీద వ్యాపారమే సురక్షితం....’’ అని గార్గ్ గారు సలహా ఇచ్చారు.. అంతేకాదు.. తాము డ్రగ్స్ వ్యాపారం చేయబోమనీ.. బంగారు వ్యాపారమే చేస్తామని సదరు సామాజిక వర్గం పెద్దలతో ఆయన ప్రమాణం చేయించడం విశేషం.