//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ నేతల పై విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతా నిరసనల పర్వం కొనసాగుతుంది. ఆ నిరసన లలో భాగం గా నిన్న విశాఖపట్నం లో బీజేపీ కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా లో బీజేపీకి, అలాగే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

ఈ నిరసన లపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు టీడీపీ నేతల నిరసన ప్రదర్శనలు శృతి మించుతున్నాయని అన్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయవద్దుఅని వారిని హెచ్చరించారు. ఈ రోజు అసెంబ్లీ ఆవరణం లో ని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అయన నిన్న మోడీకి వ్యతిరేకంగా చేసిన నిరసన లపై తీవ్రంగా మండిపడ్డాడు.

మేము మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నామని అయన చెప్పారు. మేము గనుక నోరు విప్పితే పరిస్థితి వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నిరసన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయన ఫై వెంటనే చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు. అలాగే టీడీపీ లో హత్యలు చేసేవారికి ,గుండాలకు పదవులు ఇచ్చారని తీవ్ర స్థాయి లో టీడీపీ ఫై విష్ణుకుమార్‌రాజు విరుచుకు పడ్డాడు.