//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా ఐపీఎస్ ను కంటతడి పెట్టించిన బిజెపి ఎమ్మెల్యే

Category : national

ఓ మహిళా ఐపీఎస్ అధికారితో దురుసుగా ప్రవర్తిం చాడు. నీ హద్దుల్లో నువ్వుండు అంటూ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గద్దించడంతో ఆమె కంటతడి పెట్టిన ఉదంతం ఉత్తరప్రదేశ్ లో సంచలనం కలిగించింది. కొత్తగా అధికారం లోకి వచ్చిన సి.యం యోగి ఆదిత్యనాధ్ నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడం గమనార్హం. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య మాల్లో వైరల్ అయ్యింది. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ ప్రాంతంలో మద్యం దుకాణానికి వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చి నిరసనకారులను పక్కకు తొలిగించారు. ఇంతలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధామోహన్ దాస్ అగర్వాల్ అక్కడికి చేరుకోగా ఐపీఎస్ అధికారి చారు నిగమ్ తమను బలవంతంగా రోడ్డుపై నుంచి తొలిగించారని, ఓ మహిళ తోపాటు వృద్ధుడిని కొట్టారంటూ నిరసనకారులు అనడంతో ఎమ్మెల్యే రుద్రరూపం దాల్చారు. దీంతో ఎమ్మెల్యే, చారునిగమ్ మధ్య కాసేపు వాగ్వివాదం నెలకొన్నది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నీ హద్దుల్లో నువ్వుండు అంటూ చారునిగమ్‌ను గద్దించారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆమె కన్నీళ్లు పెట్టారు. 

"ఎమ్మెల్యే నాతో దురుసుగా ప్రవర్తించారు. జనం మధ్య నన్ను అవమానించారు" అని ఆమె పేర్కొన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రారంభించిన యాంటీ రోమియో బృందంలో చారు నిగమ్ చురుకుగా పనిచేస్తుస్తూన్నారు. కొన్ని వార్తాసంస్థలు ఆమెకు లేడి సింగమ్ అని పేరు పెట్టాయి.అయితే తన కన్నీరు తన బలహీనతకు సూచిక కాదని, బలహీనంగా ఉండటం తనకు శిక్షణలో నేర్పలేదని ఆమె స్పష్టం చేశారు. మహిళలపట్ల అనుసరిస్తున్న ధోరణిపట్ల విస్మయం చెందానని అన్నారు.