//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సభలోనే బీజేపీ మంత్రుల రాజీనామా...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం సినిమాలో వచ్చే ట్విస్ట్ లకంటే మరింత ఆసక్తిని పెంచుతుంది.నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు అమరావతిలో అత్యవసరంగా మంత్రులతో భేటీ అయ్యాడు. భేటీ అనంతరం మీడియా తో బాబు కేంద్రం లో వున్న మన మంత్రులు రేపు ఉదయం రాజీనామా చేస్తారని ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు.

దీనిపై వెంటనే సపండించిన ఏపీ బీజేపీ నేతలు కూడా మీటింగ్ పెట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం తమ అఫీషియల్ వెహికిల్, మంత్రులుగా తెలిపే ఐడీ కార్డలను వారు సరెండర్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్ర కేబినెట్‌ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్‌ను బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు వీడనున్నారు. అసెంబ్లీలో నేరుగా చంద్రబాబుకు ఇద్దరు మంత్రులు రాజీనామా లేఖలు ఇస్తారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందే సభలో రాజీనామా చేసేందుకు బీజేపీ మంత్రులు సంసిద్ధమయ్యారు.

అంతకుముందు పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ పెద్దలకు ఫోన్ చేసి ఇక్కడి విషయాన్నిపూర్తిగా వివరించారు. ఈ రోజు ఉదయం 2018-19 బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కాగా, దీనికి కూడా బీజేపీ మంత్రులు దూరంగా ఉన్నారు. వారు లేకుండానే బడ్జెట్ ఆమోదం పొందింది.