//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసిన బీజేపీ : అంబరాన్ని అంటుతున్న సంబరాలు

Category : national

గుజరాత్ బీజేపీ పార్టీ కార్యకర్తలు సంబరాలను ప్రారంభించారు.

ఐదో రౌండ్ ఫలితాల వరకూ తమ విజయం పై కాస్త సందిగ్దావస్థ ఉండడంతో కాస్తంత ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు, ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడం, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో సాగుతుండటంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది.

బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. మరో పక్క హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలోనూ సంబరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ నేత, ఎమ్మెల్యే లక్ష్మణ్ ఫలితాలపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా, పలువురు కీలక బీజేపీ నేతలు, మంత్రులు విజయం దిశగా సాగుతున్నారు. తమకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్ వర్గీయుల ఓట్లు గంపగుత్తగా తమకు పడతాయని భావించిన కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైందని చెప్పవచ్చు.

పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకే అధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ తాజా ప్రెస్ రిలీజ్ ప్రకారం, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి 97 స్థానాల్లో బీజేపీ, 71 స్థానాల్లో కాంగ్రెస్ ఒక చోట నేషనలిస్ట్ కాంగ్రెస్, రెండేసి స్థానాల్లో భారతీయ ట్రైబల్ పార్టీ, స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు.

Related News