బీజేపీ పార్టీ ఆంధ్రాలో ఎప్పుడు లేని విధంగా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. అవి కూడా మాములు విమర్శలు కూడా కాదు.. జగన్ కంటే చంద్రబాబునాయుడు బెటర్ అంటూ పోలుస్తూ పెనం మీద నుండి పొయ్యి మీద పడినట్లు తయారైయ్యింది ఏపీ పరిస్థితి అంటూ బీజేపీ నేతలు మాట్లాడుతన్నారు.
వైసీపీ మాత్రం బీజేపీ చేస్తున్న విమర్శల పై ఎలాంటి కౌంటర్ ఇవ్వటం లేదు. వైసీపీ టీడీపీ నుండి ఏమైనా విమర్శలు వస్తే సమాధానం ఇస్తుంది తప్ప, బీజేపీ మాటలకు ఎలాంటి స్పందనలు చేయటం లేదు. బీజేపీ చేస్తున్న విమర్శల పై వైసీపీ సైలెంట్ గా ఉంటే వాటినే నిజమని నమ్మే జనాలు లేకపోలేదు. అయితే దాని వలన వైసీపీ ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన కూడా వైసీపీ నేతలు ఎవరు నోరు మెదపటంలేదు. ఇకపోతే వైసీపీ తరుపున యాక్టీవ్ గా ఉంటే విజయసాయి రెడ్డి బీజేపీ విమర్శలకి చలనం లేకుండా ఉండిపోవటం ఆశ్చర్యం.
వైసీపీ మౌనం వెనుక జగన్ మీద ఉన్న కేసులే ప్రధాన కారణమని తెలుస్తుంది. అదీ కాకా కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దానిని ఢీ కొట్టి నిలబడే సత్తా ఎవరికీ లేదని అర్ధం అవుతుంది. బీజేపీతో గొడవలు పెట్టుకుంటే కేసులు ఎక్కడ బయటకు వస్తాయేమో అనే భయంతో సైలెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.