//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేరళలో గోమాంసం అమ్మనున్న బీజేపీ నాయకుల సొసైటీ

Category : editorial

కేంద్రములో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దేశం వ్యాప్తంగా గోరక్ష పేరుతో గోమాంసం నిషేధం కోరుతూ ఉధృతంగా ఉద్యమాలు, ప్రచారం చేస్తున్నారు. అయితే  కేరళలోని త్రిసూర్ జిల్లాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో  ఇతర మాంసాలతో పాటు గోమాంసం కూడా అమ్మడం కోసం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  

జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏ నగేష్ చీఫ్ ప్రమోటర్ గా, జిల్లా కార్యదర్శి టి ఆర్ ఉల్లాస్ బాబు పర్యవేక్షణలో ఏర్పడిన ఈ సొసైటీ రోజువారీ కార్యకలాపాలు పర్యవేక్షించే కార్యవర్గంలో ప్రముఖ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు సభ్యులుగా ఉన్నారు. 

కేంద్రములో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికే ప్రపంచంలో గోమాంసం అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత్ కొనసాగుతున్నది. గోరక్షకుల పేరుతో జరుగుతున్న హింసాయుత దాడులలో డజన్ల కొద్దీ దళిత్ లు, ముస్లింలు గత మూడేళ్ళుగా మృతి చెందుతూ ఉండటం తెలిసిందే. 

అయితే గోమాంసం ఎక్కువగా వినియోగించే రాష్ట్రాలలో బీజేపీ నేతలు గోరక్ష గురించి మాట్లాడక పోవడం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులతో పాటు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, క్రైస్తవులు అత్యధికంగా  ఉండే ఈశాన్య రాస్త్రాలలో ఈ విషయమై బీజేపీ నాయకులు ద్వంద ప్రమాణాలు ఆవలంభిస్తున్నట్లు  విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

కేరళలో ఏర్పర్చిన ఈ సొసైటీ నీయమవాళి ప్రకారం మాంసం కోసం గోవులను పెంచి, వాటిని  అమ్ముతారు. టోకుగా, రిటైల్ గా మాంసం అమ్మడం కోసం వివిధ ప్రాంతాలల్లో సూపర్ మార్కెట్ లను ఏర్పరచాలని, మాంసం నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పరచు కోవాలని నిర్ణయించారు. జిల్లాల్లో పలు చోట్ల రెస్టారెంటు లను కూడా ఏర్పర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాంసం, కోళ్ల ఉత్పత్తుల అమ్మకాలకు మొబైల్ వ్యాన్ కూడా ఏర్పర్చుకోనున్నారు.