//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి ముందస్తు ఎన్నికల కోసం సిద్దమవుతుందా..?

Category : national politics

బిజెపి ముందస్తు ఎన్నికల కోసం సిద్దమవుతుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గతేడాది జరిగిన గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించినా ఆ విజయంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లతోనే అధికారం కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన త్రిపుర ఎన్నికల్లో విజయం సాధించినా ఆ వెంటనే జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బిజెపి కంచుకోటలు లాంటి నియోజకవర్గాలను కోల్పోయింది.

తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా విజయం ముంగిట బోల్తాపడింది. ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ప్రజలకు నమ్మకం తగ్గింది. ఇప్పుడు మోడీ కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. త్వరలోనే రాజస్థాన్ , మధ్యప్రదేశ్ చత్తీస్గఢ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మధ్య ప్రదేస్ మినహా మిగిలిన రెండు రాష్ట్రాల్లో బిజెపి సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే.

ఆ ఎన్నికల్లో కనీసం రెండు రాష్ట్రాలను బిజెపి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగైనా విజయం సాధించి ఆ తర్వాత రాజస్థాన్ మధ్య ప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళాలని బిజెపి యోచిస్తుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం సంఘ్ కూడా దీనికి ఒక స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది నవంబర్ లో సార్వత్రిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.