Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్‌ను దారుణంగా వెన్నుపోటు పొడిచిన బీజేపీ!

Category : politics

వైఎస్ జ‌గ‌న్‌కు బీజేపీ దారుణ‌మైన వెన్నుపోటు. అదేంటి..? వెన్నుపోటుకు కేరాఫ్ అడ్ర‌స్ జ‌గ‌న్ క‌దా..? ఆ క్ర‌మంలోనే క‌దా..! త‌న‌ను న‌మ్ముకున్న వంగ‌వీటి రాథాను వైసీపీకి దూరం చేసే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది..? అటువంటి జ‌గ‌న్‌కే బీజేపీ వెన్నుపోటు పొడ‌వ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటి..? అయినా, వైసీపీ - బీజేపీది మిత్రబంధం. ఆ నేప‌థ్యంలోనే క‌దా ఏపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ న‌ష్ట చేసినా వైఎస్ జ‌గ‌న్ నోరు మెద‌ప‌డం లేదు. అటువంటిది జ‌గ‌న్‌కే బీజేపీ వెన్నుపోటు పొడిచిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఏపీ రాజ‌కీయ‌లు స్థిరంగా ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డంతో రంగంలోకి దిగిన ఎన్నిక‌ల సంఘం ఎన్నికల నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. దీంతో పార్టీల అధినేత‌లు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ప్ర‌చార అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రో ప‌క్క నేత‌ల వ‌ల‌స‌లు సైతం ఊపందుకున్నాయి. ఇలా నిత్యం రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో తెలంగాణ ఒక్క‌సారిగా హీటెక్కింది.

అయితే, తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు మొగ్గు చూపిన ఎన్నిక‌ల సంఘం.. ఏపీలో ఖాళీగా ఉన్న ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు విముఖ‌త చూపింది. దీంతో, ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందాల‌ని చూసిన జ‌గ‌న్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒక్క‌సారిగా షాక్ ఇచ్చింది.

వారం క్రితం వ‌ర‌కు ఏపీలో ఖాళీగా ఉన్న ఎంపీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, ఉప ఎన్నిక‌లు వ‌చ్చేలా చేస్తానంటూ మోడీ కూడా త‌న‌కు హామీ ఇచ్చాడ‌ని అంటూ చెప్పుకొచ్చిన జ‌గ‌న్ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యంతో ఖంగు తిన్నాడు. ఏపీలో ఖాళీతా ఉన్న ఎంపీ స్థానంతోపాటు అర‌కు ఎమ్మెల్యే స్థానానికి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే పోలింగ్ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు ఈసీ అధికారులు.

Related News