//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుజరాత్‌లో బీజేపీ డౌన్‌ఫాల్!

Category : national

గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాబల్యం తగ్గుతుందా? కాంగ్రెస్‌దే పైచేయి అవుతుందా? ప్రస్తుతం దీనిపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏబీపీ న్యూస్‌ఛానెల్ కోసం లోక్‌నీతి అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను గత ఆగస్టు 31న ప్రకటించారు. ఆ ఫలితాల్లో బీజేపీకి 59 శాతం, కాంగ్రెస్‌కి 29 శాతం ఓట్లు లభించాయి. తిరిగి ఈనెల 24న ఇండియాటుడే చేపట్టిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి- 48 శాతం, కాంగ్రెస్‌కి-38శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు సర్వేల ఫలితాలను విశ్లేషించినప్పుడు కాంగ్రెస్ ఓట్ల శాతం 29 నుంచి 38శాతానికి పెరగ్గా.. బీజేపీకి మాత్రం 59 నుంచి 48 శాతానికి తగ్గినట్టు తేలింది.దీన్నిబట్టి కేవలం దాదాపు నెల 24 రోజుల్లోనే కాంగ్రెస్ 9శాతం గెయిన్ కాగా, బీజేపీ ప్రాబల్యం 11 శాతం తగ్గింది. కాంగ్రెస్ ఇలా ఓట్ల షేర్‌ని కనీసం ఆరుశాతం పెంచుకున్నా, ఆ పార్టీకి 44 శాతం రావడం ఖాయమన్నది విశ్లేషకుల భావన. అలాగే బీజేపీ ఓట్లశాతం 48 నుంచి 42కు తగ్గిపోవచ్చునన్నది ఓ అంచనా! ఈ లెక్కన రాబోయే రోజుల్లో బీజేపీకి గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.