Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్వామికి జ్ఞానం బోధపడిందా ... బీజేపీ ఓటమి షాక్ లో పరిపూర్ణానంద

Category : politics state

తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తన సత్తా చాటుతుంది అని తెలంగాణా బీజేపీ నాయకులే కాదు జాతీయ నాయకులు సైతం వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ బీజేపీ చతికిలబడింది. గతంలో లేని విధంగా ఈసారి తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణా రాష్ట్రం మొత్తంలో ఒకే ఒక స్థానం దక్కించుకుని పరువు ప్గోట్టుకుంది. తెలంగాణాలో బీజేపీ ఉందా అన్న ప్రశ్నను ఉత్పన్నం చేసింది. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం నేనే అని ఫీల్ అయిన పరిపూర్ణానంద స్వామీజీకి కూడా షాక్ ఇచ్చింది.

2018 తెలంగాణ అసెంబ్లీ బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా వ్యవహరించిన పరిపూర్ణానంద ఫలితాల అనంతరం ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తిని రేపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ఆ పార్టీ ఉన్నా ఒక విధంగా లేనట్టే అన్న భావన కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా చెప్పుకున్న పూరిపూర్ణానంద రాజకీయాల్లో కొనసాగుతారా లేదా తిరిగి తాను నమ్ముకొన్న ఆధ్యాత్మికం వైపు వెళుతారా అనే చర్చ సాగుతుంది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో పోలిస్తే తనకేం తక్కువ అనుకున్నారే ఏమోగానీ పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరారు. ఆ వెంటనే అందరి కంటే తాను ఉన్నతం అన్నట్లు వ్యవహరించడం ప్రారంభించారు. ఏకంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పక్కనే కుర్చీ వేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 30రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని అమిత్ షాకు మాటిచ్చానని పరిపూర్ణనంద పదేపదే చెప్పుకునేవారు.

పరిపూర్ణనంద కాన్ఫిడెన్స్ ను చూసి బీజేపీ నేతలే బిత్తరపోయేవారు. తానే నెక్ట్స్ సీఎం అన్నంతగా ఆయన హడావుడి కనిపించేది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే లాంటి వాళ్లకు ఇచ్చిన ఇంటర్వూల్లో కూడా ఆయన 30రోజుల్లో బీజేపీకి 70 సీట్లు సాధించి పెడతానని సవాల్ చేశారు. ఎన్నికలు జరిగినంత కాలం ఆయన తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు.తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే అసలు బీజేపీ తెలంగాణలో ఉందా అనే రీతిలో ప్రజలు ఆ పార్టీకి తీర్పునిచ్చారు. 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఒక గోషామహాల్ మినహా ఎక్కడా పోటీ ఇచ్చినా దాఖలాలు కూడా కనిపించలేదు.

బీజేపీ వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. పరిపూర్ణనంద విస్తృతంగా పర్యటించినా బీజేపీకి సీట్లు పెరిగిందేమీ లేకపోగా ఘోరంగా కోతపడింది.తెలంగాణలో బీజేపీకి కొంతమేరకైనా బలం ఉందని పార్టీ అగ్రనాయకత్వం ఆశపడింది. తెలంగాణలో ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు కిందిస్థాయిలో ఉండటం తమకు కలిసి వస్తుందని ఆశించినా ఫలితం రాలేదు. దీంతో ఇప్పుడు పరిపూర్ణానంద సైలెంట్ అయ్యారు. మరీ ఇప్పటికీ పూరిపూర్ణానందకు రాజకీయాలు బోధపడ్డాయా.. లేదా నాకేందుకు కొచ్చిందీ తంటా అని మళ్లీ తాను నమ్ముకొన్న ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లిస్తూ ఉంటారో చూడాలి. కానీ బీజేపీ ఇంత ఘోరంగా ఓటమి చెందటం మాత్రం ఆ పార్టీ కి ఆ పార్టీ విధానాలకు చెంప పెట్టు .