//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలక్రిష్ణ పై బీజేపీ యాక్షన్ ప్లాన్....!

Category : politics movies

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిన్న ధర్మ పోరాట దీక్షలో భాగం గా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

నిన్న జరిగిన వ్యవహారం గురించి గవర్నర్ కు పూర్తిగా వివరించడం జరిగిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. బాలకృష్ణపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నరసింహన్ ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి కూడా ఆయన వద్ద ప్రస్తావించామని అన్నారు.

మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చెప్పేందుకు కూడా తమకు నోరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు వేదికగా గతంలో నారా లోకేశ్ పై మెస్సేజ్ లు, వార్తలు వస్తే.. అవి రాసిన వారిని జైలుకు పంపించారని, మరి, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం అనేది మన రాష్ట్రంలోనే జరుగుతోందనిిమర్శించారు.