//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిర్యాని తిని డబ్బులు అడిగితే చంపేశారు

Category : national

బిర్యాని తిని డబ్బులు అడిగితే యజమానిని కాల్చి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి పశ్చిమ్‌బంగా నార్త్‌ 24పరగణాస్‌ జిల్లాలో ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని నలుగురు కస్టమర్లను అడిగారు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.

సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బిర్యానీ ధరపై వాగ్వాదం తలెత్తినట్లు భావిస్తున్నామని, ఇతర కారణాలేమైనా ఉన్నాయనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే నిందితులు అధికార పార్టీకి చెందిన వారని సమాచారం.