//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరలా స్వైన్ ఫ్లూ మహమ్మారి

Category : national

బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా ని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. 'హెచ్5ఎన్1' (హ్5ణ్1) అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. కోళ్లలో వ్యాపించిన ఈవ్యాధి 2 రకాల వ్యాధి లక్షనాలు ప్రకోపించవచ్చు.

ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినపుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రముగా సోకినపుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతుంది. కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితముగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్టలద్వారా కూడా ఈవ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షులలో ఈవ్యాధి క్రిములు పేగులలో ఉండవచ్చును. కాని దీప్రభావము వెంటనే కనిపించదు. పేగులు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షిజాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి.

మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండి ఈ వైరస్ అంటే భయమే.

తాజాగా కర్ణాటకలో ఈ వ్యాధి సోకిందని దుమారం చెలరేగింది. కోళ‍్లకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి ఉందని నిర‍్ధారణ కావడంతో కర్ణాటకలో కొన్నిచోట‍్ల కోడి మాంసం విక్రయించే దుకాణాలు మూతపడ్డాయి. ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుందన‍్న భయంతో ప్రభుత‍్వ యంత్రాంగం అత‍్యవసర చర‍్యలు చేపట్టింది. బ్యాటరాయణపుర పరిధిలో ఇప‍్పటికే కోడి మాంసం అంగళ‍్లను మూసివేశారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కోళ‍్లలో కొన్ని మృతిచెందడంతో వాటిని పరీక్షించగా విషయం బయటపడింది.

దాసరహళ్లిలోని కేజీఎన్‌ కోడి మాంసం విక్రయించే అంగడిలో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 15 నాటు కోళ్లలో నాలుగు చనిపోయాయి. వాటిని హెబ్బాళ్‌లోని పసువుల ఆస‍్పత్రికి పరీక్షలకోసం తరలింగా అక్కడి నుంచి భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. అక‍్కడ పరిశీలించిన వైద్యులు కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి (హెచ్‌ 5 ఎన్‌ 1) సోకిందని నిర్ధారించారు.

విషయం తెలిసిన అధికారులు దాసరహళ్లి చుట్టు పక్కల రెండు కిలోమీటర‍్ల పరిధిలోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయించారు. బర్డ్‌ ఫ్లూ సోకిందేమోనని మరికొన్ని ప్రాంతాల‍్లో తనిఖీలు నిర‍్వహిస్తున్నారు. కోళ‍్లు చనిపోతే విధిగా పరీక్షలు చేయించాలని దుకాణ నిర్వాహకులను కోరుతున్నారు.