యూరోపియన్ యూనియన్‌కు చెందిన యాంటి ట్రస్ట్ రెగ్యులేటర్ గూగుల్‌కు వ్యతిరేకంగా నమోదైన ఓ ప్రతిష్ఠాత్మక కేసులో త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. తన షాపింగ్ సర్వీసెస్‌కు అనుకూలంగా శోధన ఫలితాలను తారుమారు చేస్తోందని గూగుల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇది నిరూపణ అయితే దాదాపు 1.1 బిలియన్ డాలర్ల లేదా గూగుల్ ఓ సంవత్సర ఆదాయంలో పదో శాతం జరిమానా గా విధించే అవకాశం ఉంది.
యూరోపియన్ యూనియన్ అధికారులు ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. గత ఏడాది జులైలో ఈ అంశంపై నియమించిన కమిషన్ తన నివేదికలో గూగుల్ సెర్చింజన్ ఫలితాలను తన షాపింగ్ సర్వీసెస్‌కు అనుకూలంగా సిస్టమాటిక్‌గా మార్చివేసిందని పేర్కొంది. యూరోపియన్ కమిషన్స్ కాంపిటీషన్ కమిషనర్ మార్గ్రెత్ వెస్టగర్ సెర్చింజన్ దిగ్గజంపై కఠిన నిర్ణయం తీసుకోవాలని పారిస్, బెర్లిన్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, గూగుల్ పోటీదారులు కోరుతున్నారు.
మరోవైపు గూగుల్ తన శోధన ఫలితాల్లో తనకు పోటీగా ఉన్న వివిధ వెబ్సైట్లను పరిశీలిస్తారట. గూగుల్ వల్ల తాము నష్టపోయామని పోటీదారుల కానీ, వినియోగదారులు గానీ క్లెయిమ్ చేస్తే కమిషన్ అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది. గతంలోనూ మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి సంస్థలపై బ్రెసెల్స్ క్లెయిమ్స్ చేసింది. వాటిని కమిషన్ తిరస్కరించింది. 2009లో గుత్తాధిపత్యం వహిస్తోందన్న కారణంగా ఇంటెల్‌కు 1.06 బిలియన్ డాలర్లు జరిమానా విధించారు.