//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌లోకి ఇద్ద‌రు టీఆర్ఎస్ బ‌ఢా నేత‌లు..!

Category : politics

టీఆర్ఎస్‌లో సాగుతున్న అన్న‌దమ్ముల పంచాయ‌తీ  రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చెన్నూరు నుంచే పోటీ చేసి తీరాల‌ని అన్న‌య్య వినోద్ తెగేసి చెబుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క సుమన్‌ని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసింది. ఇంకా బీఫామ్ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి అన్న‌ద‌మ్ముళ్లు ఇద్ద‌రూ త‌మ ప్ర‌య‌త్నాల‌ను సీరియ‌స్‌గానే చేస్తూ వ‌చ్చారు. 


అన్న‌య్య‌కు ఎలాగైనా, చెన్నూరు టిక్కెట్ ఇప్పించేందుకు త‌మ్ముడు వివేక్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. కానీ, ఫ‌లితం క‌నిపించ‌క‌పోవ‌డంతో కారు దిగే దిశ‌గా వివేక్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు గులాబీదండు చెబుతుంది. అదే స‌మ‌యంలో ఇటు త‌మ్ముడు వివేక్ మాత్రం తాను పార్టీ మారేది లేద‌ని తెగేసి చెబుతుండటంతో అన్న‌ద‌మ్ముళ్ల పంచాయ‌తీ కాస్తా.. అన్న‌ద‌మ్ముళ్ల స‌వాల్‌గా మారుతుందా..? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోగా సాగుతుంది.


తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైన‌ప్ప‌ట్నుంచి చెన్నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా సెగ‌లు రాజుకుంటూనే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలును కాద‌ని బాల్క సుమ‌న్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది టీఆర్ఎస్ అధిష్టానం. దీంతో ఓదేలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సుమన్‌కు స‌హ‌క‌రించేది లేద‌ని చెప్ప‌డం, ఆ త‌రువాత ఓదేలు అనుచ‌రుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం చివ‌ర‌కు కేసీఆర్ జోక్యంతో ఓదేలు శాంతించ‌డం వ‌రుస‌గా జ‌రిగిపోయాయి. 

అయితే, త‌మ ఫ్యామిలీకి తొలి నుంచి అండ‌గా నిలుస్తూ వ‌చ్చిన చెన్నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టిక్కెట్ త‌మ‌కే కేటాయించాల‌ని వివేక్‌, వినోద్ ఇద్ద‌రు కూడా కేటీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేశార‌ట‌. అయితే, ఈ విష‌యంలో తాను ఏమీ చేయ‌లేన‌ని కేసీఆరే తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని కేటీఆర్ తేల్చి చెప్పేశార‌ట‌. నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తున్న‌ప్ప‌టికీ కేసీఆర్ నుంచి ఎటువంటి పిలుపు రాక‌పోవ‌డంతో వినోద్ తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ని ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం చెబుతుంది. దీంతో, త‌మ్ముడు వివేక్‌ను వ‌దిలి తాను పార్టీ మారే దిశ‌గా వినోద్ ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ని టీఆర్ఎస్ శ్రేణులు  గుస‌గుస‌లాడుకుంటున్నాయి. 


అన్న‌కు టిక్కెట్ ఇప్పించ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన వివేక్ సుమ‌న్‌కు అనుకూలంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్ర‌చార కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన‌లేదు. చొప్ప‌దండి నుంచి సుమ‌న్‌ను పోటీ చేయించ‌వ‌చ్చ‌న్న ప్ర‌తిపాద‌న‌ను కూడా అధిష్టానం ముందుకు అన్న‌ద‌మ్ముళ్లు తీసుకెళ్లార‌ట‌. చివ‌ర‌ఖ‌ర్లో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాను ఎంపీగా పోటీ చేయ‌న‌ని, అందుకు బ‌దులుగా త‌న అన్న‌కు చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను కూడా వివేక్ చేశార‌ట‌. అయితే, పార్టీ హైక‌మాండ్ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం కేసీఆర్ నుంచి పిలుపు రాక‌పోవ‌డంతో కారు దిగిపోవ‌డ‌మే మంచిద‌ని, కాంగ్రెస్‌లోకి వెళ‌తాన‌ని తన అనుచ‌ర‌వ‌ర్గంతో వివేక్ చెబుతున్నార‌ట‌. ఇప్ప‌టి దాకా అన్న‌ద్ముళ్లు ఇద్ద‌రూ క‌లిసి రాజ‌కీయం చేస్తూ వ‌చ్చారు.  రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పైన దాడి చేయ‌డ‌మైనా... పార్టీలు మార‌డ‌మైనా.. ఇద్ద‌రిదీ ఒకే మాట‌.. ఒకే బాట‌లో ఉండేది. అయితే, ఇప్పుడు చెన్నూరు ఎపిసోడ్ అన్న‌ద‌మ్ముళ్ల‌ను విడ‌దీస్తుందా...? అన్న డిస్క‌ర్ష‌న్ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుంది. వినోద్ కారు దిగితే కాంగ్రెస్ గూటికే వెళ‌తార‌న్న చర్చ కూడా న‌డుస్తుంది.