//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ కు షాకింగ్ న్యూస్ .. ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో టీఆర్ఎస్ అవుట్

Category : politics

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రంజుగా సాగుతోంది. టీఆర్ఎస్- మ‌హాకూట‌మి మ‌ధ్య పోటీ తారా స్థాయికి చేరింది.. ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉంది.ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం సాగిస్తున్న టీఆర్ఎస్ తన గ్రాఫ్ పెరిగిందని భ్రమ పడుతుంది. కూటమి సీట్ల సర్దుబాటు గందరగోళం తనకు లాభిస్తుందని భావిస్తుంది. కానీ తాజాగా విడుద‌ల అయిన స‌ర్వే రిజ‌ల్ట్స్ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతూ టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది.


ఇక అస‌లు విషయం ఏమిటంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకుండా శతవిధాలా ప్రయత్నించిన కేసీఆర్ మళ్ళీ విజయం తమదే అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ముందస్తుకు వెళ్ళారు. అయితే ఆయన అంచనా తారుమారయ్యింది.డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని.. మహాకూటమి విజయం ఖాయ‌మ‌ని ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది.

ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌డంతో తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయ‌ని.. రాహుల్‌తో- బాబు భేటీ మ‌హాకూట‌మికి కూడా బాగా క‌లిసి వ‌చ్చింద‌ని దీంతో మొన్న‌టివ‌ర‌కు గెలుపు శాతం టీఆర్ఎస్ వైపు ఉండ‌గా.. ఇప్పుడు మ‌హాకూట‌మి వైపు ట‌ర్న్ తీసుకుంద‌ని ఆ సర్వే తేల్చేసింది.

ఇక ఆ స‌ర్వే ఇచ్చిన రిజ‌ల్ట్ చూస్తే..

మ‌హాకూట‌మి 64 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని..

టీఆర్ఎస్ 42 స్థానాల‌తో రెండ‌వ స్థానంలో నిలిచి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటుంద‌ని సీ ఓటర్ సర్వే తేల్చిచెప్పింది.

ఇక బీజేపీ కి 4 , ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆ స‌ర్వే తెలిపింది. ఇప్పుడు ఈ సర్వే పై తెలంగాణా లో చర్చ జోరుగా సాగుతుంది.

ఇంతకీ రోజుకో సంస్థ విడుదల చేస్తున్న సర్వేల్లో ఏది నిజమో కానే ఈ సర్వే మాత్రం కేసీఆర్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది

Related News