ఇప్పుడిదే హాట్ టాపిక్ నడుస్తోంది. భూమానాగిరెడ్డి చనిపోవడం అఖిల మంత్రి పదవి దక్కించుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఐతే పొలిటికల్ ఈక్వేషన్స్ నంద్యాలలో అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. నాకే సీట్ ఇవ్వాలి లేదంటే పార్టీ మారిపోతానంటూ శిల్పా మోహన్ రెడ్డి డైరక్ట్ గా ఎనౌన్స్ చేశాడు. పోటీ చేసేది ఖాయం అది మా ఫ్యామిలీ నుంచే క్యాండిడేట్ ఉంటాడంటూ అఖిలప్రియ కూడా ఓపెన్ గానే చెప్పేసింది. దీంతో ఇప్పుడు టిడిపిలో హీట్ సమ్మర్ హీట్ ని దాటేస్తోంది. పార్టీ మాట, బాబు మాట ఎలాగున్నా నా మాటే ఫైనలన్న రేంజ్ లో అఖిలప్రియ మాట్లాడటం కాస్త ఆశ్చర్యమే...ఐతే ఇక్కడ జగన్ తన పార్టీ తరపున ఎవర్ని నిలబెడతారో తెలీదు. కానీ అఖిలప్రియ ఫ్యామిలీ నుంచి కేండిడేట్ ఉంటే తప్పకుండా సింపతీ వేవ్ వస్తుందని తలపండిన పండితులు చెప్తున్నారు.
అటు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడం రాజకీయంగా ఏకాకిలా కన్పిస్తున్న ఓ యువతి ప్రచారంలోకి దిగితే సీన్ అంతా టిడిపికి ఫేవర్ అవుతుందని టాక్. ఇంకో నాలుగురోజుల్లో అభ్యర్ధిప్రకటిస్తా అని అఖిలప్రియ చెప్పడం ఆమె దూసుకుపోతోన్న తీరు చెప్తోంది. మరి జగన్ గ్రూప్ మాత్రం సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తోంది తప్ప వేరేది లేదు. కానీ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి పాలైతే..మిగిలిన చోట్లా బై ఎలక్షన్స్ కి రమ్మని సవాళ్లు ఎదురవుతాయ్. దాన్ని ఎదుర్కోవడం కష్టమే..మరి విషయం ఏంటనేది ఇంకో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.