//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ సెకండ్ సీజ‌న్ స్టార్ట్.. మీ కోసం జ‌స్ట్‌ స్మాల్ రివ్యూ..!

Category : movies

తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నేచురల్ స్టార్ నాని. వీధి చివర ఉంటాది.. ఓ టీ కొట్టు మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అనే ఎంట్రీ సాంగ్‌తో బిగ్‌బాస్ సీజన్ 2లో హోస్ట్‌‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాని. వచ్చీ రావడంతో ఫ్లైయింగ్ కిస్‌లతో మోడల్స్ బిగ్‌బాస్ సెట్‌లో చిందేసి సందడి చేశాడు.

వచ్చీరావడంతో నేచురల్ పంచ్‌లు పేల్చేశాడు. తాను బిగ్ బాస్ షోను ఇప్పటి వరకూ చూడలేదని ఏ ముహూర్తాన అన్నానో కాని రెండు రోజుల పాటు బిగ్‌బాస్ సీజన్ 1 మొత్తాన్ని చూపించేశారన్నారు. అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ సంపూర్ణేష్, ప్రిన్స్, హరితేజ, ధనరాజ్‌ల గురించి చెబుతూ.. బిగ్ బాస్ సీజన్ 1‌తో తెలుగు బుల్లితెరపై సంచలనాలను క్రియేట్ చేసిన తారక్‌కి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఏమేమి ఉన్నాయో ప్రేక్షకులకు వివరించారు నాని. ఆదివారం రాత్రి ప్రారంభం అయిన ఈ షోలో బిగ్‌బాస్‌ 2 సెట్‌ గురించి తొలుత నాని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వరుసగా షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ వివరాలివి..

* తొలి కంటెస్టెంట్‌గా టాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌ గీతా మాధురి షోలో అడుగుపెట్టారు

* రెండో కంటెస్టెంట్‌ నటుడు అమిత్‌ తివారీ (విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు)

* మూడో కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన యాంకర్‌ దీప్తి నల్లమోతు (ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు)

* నాలుగో కంటెస్టెంట్‌ నటుడు తనీష్‌ (బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు)

* ఆశ్చర్యకరంగా ఐదో కంటెస్ట్‌గా బాబు గోగినేని (హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్) బిగ్‌బాస్‌ 2 షోలో అడుగుపెట్టాడు.

* ఆరో కంటెస్టెంట్‌ భాను శ్రీ ( బాహుబలిలో తమన్నాకు స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు)

* ఏడో కంటెస్టెంట్‌గా రాప్‌ సింగర్ రోల్‌ రిడా (రాహుల్‌ కుమార్‌ అలియాస్‌ రోల్‌ రిడా), రాప్‌ సింగర్‌తో కలిసి ప్రత్యేక నృత్యంతో అలరించిన ముమైత్‌ ఖాన్‌.

* ఎనిమిదో కంటెస్టెంట్‌ యాంకర్‌ శ్యామల (పలు టీవీ షోలో యాంకర్‌గా వ్యవహరించారు, అలాగే కొన్ని చిత్రాలలో నటిగా మెప్పించారు)

* తొమ్మిదో కంటెస్టెంట్‌ కిరీటి ధర్మరాజు (పలు షార్ట్‌ ఫిలింస్‌. టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్)

* పదో కంటెస్టెంట్‌ దీప్తీ సునయన (సోషల్‌ మీడియా సెన్సేషన్‌. డబ్‌ స్మాష్‌ వీడియోల‌తో బాగా పాపులర్ అయ్యారు‌. నిఖిల్‌ హీరోగా నటించిన కిర్రాక్‌ పార్టీలో ఓ పాత్రలో కనిపించారు)

* పదకొండో కంటెస్టెంట్‌ నటుడు కౌశల్‌ (పలు సీరియల్‌లో నటుడిగా మెప్పించారు, పలు చిత్రాల్లోనూ అలరించారు.)

* పన్నెండో కంటెస్టెంట్‌ తేజస్వి మదివాడ( కేరింత, ఐస్‌క్రీమ్‌, నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌, శ్రీమంతుడు పలు చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు)

* పదమూడో కంటెస్టెంట్‌ నటుడు సామ్రాట్‌ రెడ్డి (అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో మెయిన రోల్‌లో కనిపించారు, అంతేకాకుండా పలు * సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నెళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు.)

* పద్నాలుగో కంటెస్టెంట్‌గా సెలబ్రిటీలతో కలిసి హౌజ్‌మేట్‌గా సామాన్యుడు గణేశ్‌ పాల్గొనబోతున్నారు.‌

* బిగ్‌బాస్‌2లోకి సామాన్యురాలిగా పదిహేనో కంటెస్టెంట్‌ సంజన

* మరో సామన్యుడిగా, పదహారో కంటెస్టెంట్‌గా నూతన్‌ నాయుడు (సామాజిక కార్యకర్త)

ఇక తొలిరోజే 16 మంది కంటెస్టెంట్‌ నుండి ఇద్దర్ని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా ఎక్కవ మంది కామన్ పీపుల్స్ అయిన సంజనా. నూతన్‌ నాయుడుల పేర్లు చెప్పడంతో హౌస్‌లో ఉన్న జైల్‌లో ఆ ఇద్దరు సెలబ్రిటీలను ఉండాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించడంతో ఆ ఇద్దర్ని జైల్‌లో పెట్టి లాక్ చేశారు సెలబ్రిటీలు. ఇక ఇంత మంది సెలబ్రిటీలతో కామన్ పీపుల్‌గా వచ్చిన తమనే జైల్‌లో పెట్టడం పట్ల ఫైర్ అవుతోంది సామాన్య సెలబ్రిటీ కంటెస్టెంట్ సంజనా అన్నే. మరి ఈ జైలు విడుదలయ్యే సెలబ్రిటీ ఎవరో రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. ఏది ఏమైనా బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్ ఎన్ని సంచ‌నల‌నాల‌కు కేంద్ర‌బిందువు అవుతుందో చూడాలి.