Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ కానుంది వారిద్దరిలో ఒకరట?

Category : movies

బిగ్ బాస్ ఇంటి సభ్యుల నుండి మరో మూడు రోజులలో మరొకరు వెళ్ళనున్నారు. పోయిన వారం ఎలిమేషన్ కోసం నామినేట్ అయిన ఆరుగురు ఇంటి సభ్యుల నుండి నటి హేమ ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కి గాను శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేశ్ విట్టా, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం తో కలిపి మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారట. వీరిలో శ్రీముఖి, హీరో వరుణ్ తో పాటు అతని భార్య వితికా షేరు ఉండటం గమనార్హం. కాగా ఈ ఎనిమిది మంది ఇంటి సభ్యులనుండి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

శ్రీ ముఖి కి బయట పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందికాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదని చెప్పాలి. గ్లామర్ టచ్ కొరకు శ్రీ ముఖి కు భారీ పారితోషకం చెల్లించి షోలోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె సేఫ్ అని చెప్పొచ్చు. ఇక వరుణ్ సందేశ్ ఒకప్పటి హీరో కావడంతో పాటు, ఉన్న ఇంటి సభ్యులందరిలో కొంచెం ఎక్కువ సెలెబ్రిటీ హోదా కలిగిన వారు కనుక ఆయన కూడా ఎలిమినేట్ అయ్యేఅవకాశం లేదని కొందరి వాదన. ఇక పొతే నామినేట్ కాబడిన ఎనిమిది మంది సభ్యులలో జాఫర్, వితికా షేరు లకు మిగతా వారికంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యేఅవకాశం ఉండగా, వితికా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని వినికిడి. గతవారం అందరూ ఊహించిన విధంగానే నటి హేమ ఎలిమినేట్ అయింది. మరి ఇక ఇప్పుడు అందరి ఊహాగానాల మేరకు జాఫర్ లేక వితికా షేరు ఎలిమినేట్ కానున్నారట.