//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ లీక్ .....ఇక సర్దుకోనున్న బాబు గోగినేని .....!

Category : movies

బిగ్ బాస్ తెలుగు బుల్లితెర పై సరికొత్త సంచలనాలు సృష్టించిన రియాలిటీ గేమ్ షో. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ లో లీకుల బెదడ చాల ఇబ్బంది పెడుతుంది. వారాంతరం లో జరిగే ఎలిమినేషన్ లో ఎవరు ఇంటి నుండి బయటకి రాబోతున్నారో ముందే చెప్పి ఈ షో పై ఉండే ఆసక్తి ని తగ్గిస్తున్నారు.

మొదటి రెండు వారలు తప్ప మిగిలిన వారందరి ఎలిమినేషన్ కూడా లికర్స్ చెప్పిన విధంగానే జరిగింది . అలాగే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజారాంచంద్రన్ అని ముందే చెప్పేసారు . దీనితో ఏంచేయాలో అర్థంకాక బిగ్ బాస్ నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారు

ఇప్పుడు మళ్ళీ ఒక వార్త సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది . అదేమిటంటే ఈ వారం హౌస్ నుండి రాబోయేది బాబు గోగినేనిగారే అని చెప్పేస్తున్నారు. కౌశల్ తో వున్న విభేదాల కారణంగా , అలాగే హౌస్ లో బాబు గోగినేని ప్రవర్తనతో విసుకుచెందిన బిగ్ బాస్ అభిమానులు ఆయనకి ఓట్లు వేయలేదని తెలుస్తుంది. ఇక ఎలాగూ కౌశల్ ఆర్మీ కాబట్టి వారి టార్గెట్ కూడా బాబు గోగినేని గారే అని అందరికి తెలిసిందే. కాబట్టి ఈ వారం బాగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేది బాబునే అని చర్చించుకుంటున్నారు.