Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ప్రముఖ హీరో అంటే నాకు చాల ఇష్టం: కౌశల్

Category : movies

కౌశల్ ఇప్పుడు ఈ పేరు ట్రేండింగ్ లో ఉంది. నాని వ్యాఖ్యాతగా మాటీవీ లో ప్రసారమైన గేమ్ షో బిగ్ బాస్ సీజన్-2 . ఈ షో గేమ్ విన్నర్ కౌశల్. ఇంతకముందు కౌశల్ అంటే టీవీ సీరియల్స్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడు కౌశల్ ప్రపంచానికి మొత్తం తెలుసు. దీనికి కారణం కౌశల్ ఆర్మీ. ఈ కౌశల్ ఆర్మీ వలెనే సోషల్ మీడియా ద్వారా అందరికి పరిచయమయ్యాడు.

ఇప్పుడు కౌశల్ కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే డైరెక్టర్ మారుతి కాల్ చేసారంట.దీనితో మారుతి సినిమాలో కౌశల్ హీరో అంటూ వార్తలు వచ్చాయి. తరువాత సుకుమార్ కాల్ చేసారంట. అదే విధంగా ప్రధాని ఆఫీస్ నుంచి కూడా అభినందనలు వచ్చాయంట. అయితే ఇప్పుడు కౌశల్ రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

అయితే ఈ యువ హీరోకి లోక నాయకుడు కమల్ హాసన్ అంటే చిన్నప్పటి నుంచి చాల ఇష్టమంట. అలాంటి నటుడు బిగ్‌బాస్‌-2 హౌస్‌లోకి రావడం, తాను ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఎంతో ఆనందానిచ్చింది అని కౌశల్ అన్నాడు. ఆ సమయంలో కమల్‌హాసన్‌కు నా గురించి చెప్పడం, ఆయన నాకు శుభాకాంక్షలు తెలియజేయడం ఎనలేని అనుభూతిని ఇచ్చిందని కౌశల్ చెప్పాడు.

Related News