//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్‌ హోస్ట్ సల్మాన్‌కు పారితోషికం ఎంతో తెలుసా?

Category : movies

కేవలం ఒక్క రియాలిటీ షోకి 400 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరో మీకు తెలుసా ఇది కేవలం కొన్ని వారాల పాటు జరిగే షో. ఆ మాత్రం దానికే అతడికి ఏకంగా 400 కోట్ల పారితోషికం ముడుతోంది.ఊహకైనా అందని పారితోషికం ఇది.ఇంతకీ అందుకుంటున్నది ఎవరు అంటే ది గ్రేట్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్.అతడు హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్ 13 కోసం ఇంత పెద్ద మొత్తం ముడుతోంది.ఒక్కో ఎపిసోడ్‌కి 31 కోట్లు చొప్పున మొత్తం అన్ని ఎపిసోడ్లకు కలిపి అతడు 400 కోట్లు అందుకుంటున్నాడన్నది తాజా సమాచారం.

కేవలం హోస్టింగ్ చేసినందుకే ఇంత పెద్ద మొత్తం సల్మాన్ ఖాన్ అందుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఈ సీజన్ 26 ఎపిసోడ్ల కోసం అంటే 26 వారాల పాటు తన సినీ షూటింగ్ సమయాన్ని సల్మాన్ ఖాన్ వెచ్చించాల్సి ఉంటుంది.అయితే అంత పెద్ద మొత్తం అందుకునేందుకు అతడికి మాత్రమే అర్హత ఉందన్నది అభిమానులు చెబుతున్న మాట.బిగ్ బాస్‌ని ఇప్పటికే ఎంతో విజయవంతంగా నడిపించిన హోస్ట్‌గా సల్మాన్ పేరు మార్మోగిపోతోంది.

అతడు హోస్ట్ అనగానే ప్రపంచవ్యాప్తంగా టీఆర్‌పీ అదురుతుంది.దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ ఉన్న షోగా బిగ్ బాస్‌ని మలచడంలో భాయ్ పెద్ద సక్సెస్ అయ్యాడు.ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో రెవెన్యూ అందుకుంటున్న ఏకైక భారతీయ హీరో సల్మాన్ ఖాన్ అనడంలో సందేహమే లేదు.ఇక సల్మాన్ భాయ్ స్థానంలో వేరొక హోస్ట్‌ని ఎంపిక చేసేందుకు కలర్స్ బృందం ప్రయత్నించినా అది వీలుపడలేదు.బిగ్ బాస్ సీజన్ 13 కోసం జే భానుషాలి,మహి విజ్,వివేక్ దాహియా లాంటి పేర్లు పార్టిసిపెంట్స్ జాబితాలో వినిపిస్తున్నాయి.