//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు బిగ్ బాస్‌-2.. గీతామాధురి రేటెంతో తెలిస్తే మైండ్ తిరిగిపోవాల్సిందే..!

Category : movies

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సెకండ్ సీజ‌న్ గ‌త‌ ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. బిగ్ బాస్-1 కు యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హారించ‌గా, ఈ సెకండ్ సీజ‌న్‌కు ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బిగ్ బాస్ -2 లో పాల్గొనే సెల‌బ్రెటీలు ఎవ‌ర‌నే దానిపై గ‌త కొంత‌కాలంగా అనేక ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తున్నారు. అయితే ఆదివారం ప్రారంభ‌మైన బిగ్ బాస్ సెంక‌డ్ సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌తో బిగ్ బాస్-2 కంటెస్టెంట్స్ ఎవ‌రో తెలిసిపోయింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లోకి గీతా మాధురి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గీతా మాధురి బిగ్ బాస్ లోకి వెళ్ళుతుందంటే ఎవరు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే మొదటి నుంచి గీతా మాధురి పేరు వినపడుతూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 2 లో ఉన్న పార్టిసిపెంట్స్‌లో గీతా మాధురికే ఎక్కువ ఫేమ్ ఉంది. అలాంటి గీతా మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినందుకు ఎంత పారితోషికం ఇస్తున్నారో తెలుసా.. ప్రస్తుతం బిగ్ బాస్ రెండో సీజన్ లో తీసుకున్న వారందరిలో గీతా మాధురికే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గీతా మాధురి బిగ్ బాస్ హౌస్‌లో పది రోజులు ఉన్నా లేదా వంద రోజులు ఉన్నా ఆమె పారితోషికం ఇంత అని ముందే ఫిక్స్ చేసేసారట. గీతా మాధురి బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసినందుకు 20 లక్షలు ఇస్తున్నారట. ఈ వార్తలో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. గీతా మాధురి హీరో న‌వ‌దీప్ త‌మ్ముడు న‌టుడు అయిన‌ నందుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.