అనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ ప్రియుల కోసం బిగ్‌ఫ్లిక్స్ పేరిట ఓ నూతన సేవను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌తోపాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లలో బిగ్‌ఫ్లిక్స్ లభిస్తోంది. దీంట్లో 9 భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ భాషకు చెందిన పలు సినిమాలను, ట్రైలర్స్‌ను, షార్ట్ ఫిలిమ్స్, వీడియోలను ఏర్పాటు చేశారు. బిగ్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి మొత్తం 2వేల సినిమాలు ప్రేక్షకులకు లభిస్తున్నాయి. అవన్నీ హెచ్డీ క్వాలిటీతో ఉన్నాయి. అయితే బిగ్‌ఫ్లిక్స్ ను వాడుకోవాలంటే యూజర్లు నెలకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లిస్తే వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ఎందులోనైనా అన్లిమిటెడ్ సినిమాలను చూడవచ్చు.