//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ అభిమానులకి బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా .....

Category : movies

బృందావనం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన థమన్ చాలా తక్కువకాలంలోనే టాలీవడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగాడు . దాదాపుగా ఇండస్ట్రీ లోని స్టార్ హీరోలందరి సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ ని ఇచ్చాడు . ప్రస్తుతం థమన్ మంచి ఉత్సాహంగా , ఊపు మీద ఉన్నాడు .

థమన్ సంగీతమందించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ అరవిందసమేత చిత్రానికి పాటలే సగంబలాన్ని ఇచ్చాయి అనడం లో ఎటువంటి సందేహంలేదు . ఈ సినిమాలోని పెనీవిటి సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది . అరవిందసమేత ఇచ్చిన ఉత్సాహంలో ప్రస్తుతం మంచి ట్యూన్ సిద్ధం చేస్తున్నారు. ఏ సినిమా కోసం అనుకుంటున్నారా ....ఇప్పుడు చేస్తున్న ట్యూన్స్ ఏ సిసినిమా కోసం కాదు ప్రభాస్ కోసం. బాహుబలి తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సాహో చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమాలున్న వీరు సాహో చిత్రానికి పాటలను సమకూర్చేపనిలో చాలా బిజీ గా ఉన్నారు. అయితే ఆ సినిమాకి సంబంధించిన ఏదైనా సాంగ్ ని ప్రభాస్ పుట్టినరోజు న రిలీజ్ చేస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ అభిమానులు . అయితే సాహో టీమ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు . సాహో చిత్రం పాటలను ఫిబ్రవరి లో విడుదల చేస్తారని తెలుస్తుంది . అందుకే ప్రభాస్ అభిమానులను నిరాశపరచకుండా ఉండేందుకు యువి బ్యానర్ వారు థమన్ రంగంలోకి దింపారని తెలుస్తుంది . ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఓ ప్రత్యేక బీజీఎమ్ ని యువీ క్రియేషన్స్ వారు రెడీ చేస్తున్నారని ఫిలిం నగరవాసులు చెప్ప్తున్నారు . ఆ బీజీఎమ్ ని పుట్టినరోజున విడుదల చేస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు కూడా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి థమన్ సంగీతాన్ని ఇవ్వలేదు. అందుకే ఈ బీజీఎమ్ తో ప్రభాస్ మూవీకి పనిచేసే అవకాశం అందుకోవాలనే లక్ష్యంతో థమన్ బాగా కసిగా కంపోజ్ చేస్తున్నట్టు తెలిసింది.