//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కు ఝలక్ ...వైసీపీ కీలక నేత టీడీపీలో చేరే ముహూర్తం ఫిక్స్

Category : politics

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆ పార్టీ వీడి పక్క పార్టీల్లో చేరుతున్నారు వైసీపీ నేతలు . జగన్ వారికి టికెట్ ఇవ్వకుండా ఝలక్ ఇస్తే ఆ పార్టీ నాయకులు వరుస షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో వైసీపీకి మరో షాక్ షాక్ తగిలింది. తాజాగా ఆ పార్టీనేత నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత నెలలో వైసీపీకి రాజీనామా చేశారు. బాబుతో భేటీ అయిన ఆయన టీడీపీలో చేరటానికి సనాహాలు చేసుకుంటున్నారు.

వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేసిన బొమ్మిరెడ్డి కి మాట మాత్రమైనా చెప్పకుండా ఆనం కు ఇంచార్జ్ కట్టబెట్టటంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. మొన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును బొమ్మిరెడ్డి కలిసిన నేపధ్యంలో చంద్రబాబు కూడా బొమ్మిరెడ్డి చేరికకు ఒకే చెప్పారని తెలుస్తుంది. దాంతో అయన టీడీపీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 15 లోపు బొమ్మిరెడ్డి టీడీపీలో చేరే అవకాశమున్నట్టు వార్తలు వచ్చాయి కానీ వచ్చే సోమవారం, కార్తీక సోమవారం కావటంతో అదే రోజున తెదేపా తీర్ధం పుచ్చుకోవాలని, భారీ అనుచరగణంతో పార్టీలో చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు బొమ్మి రెడ్డి. మొత్తానికి వెనకతగిరిలో మంచి పతున్న నేత బొమ్మి రెడ్డి వైసీపీ కి గతి షాక్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. కార్తీక మాసంలోనే అందుకు ముహూర్తం పెట్టుకున్న బొమ్మిరెడ్డి జగన్ కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఫిక్స్ అయ్యారు.

వెంకటగిరిలో రాఘవేంద్రరెడ్డికి బలమైన అనుచరవర్గం ఉంది.ఈ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో మంచి పట్టు కూడా వుంది. బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తండ్రి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్‌గా విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పలుమార్లు ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మంగళవారం బొమ్మిరెడ్డిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. మొత్తానికి 15 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన అనంతరం సంతృప్తిగా వెలుపలకు వచ్చిన బొమ్మిరెడ్డి.. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని చెప్పారు. చంద్రబాబు తనకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చారని, అంతే కాక ఆయన మాట్లాడుతూ మీ తండ్రితో నాకు మంచి అనుబంధం ఉంది… మీరు పార్టీలోకి రండి. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏ పదవి ఇస్తానో, ఎలా చేస్తానో ఇప్పుడే చెప్పలేను, అయితే మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు, ప్రజాజీవితంలో ఉంటారు. ఆ బాధ్యత నాది..! అని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకే ఆయన సంతృప్తిగా పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. సీఎం మాట్లాడిన తీరు, తన పట్ల చూపించిన ఆసక్తికి బొమ్మిరెడ్డి చాలా సంతోషాన్ని వ్యక్తంచేశారు. మొత్తానికి వైసీపీ కి భారీ షాకిచ్చి బొమ్మి రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

Related News