//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో మ‌రో రెండు వికెట్లు డౌన్‌..!

Category : politics

నెల్లూరు జిల్లా YCP లో ఇప్పుడు టికెట్ వార్ జోరుగా సాగుతుంది. ఇందుకు ఏ మాత్రం మిన‌హాయింపు కాదంటున్నాయ‌ట కావాలి YCP పాలిటిక్స్‌. కావ‌లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్ర‌తాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న‌కు టికెట్ సెగ మొద‌లైంది. Congress నుంచి YCP లోకి జంప్ చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి టీడీపీ నుంచి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఇప్పుడు టికెట్ రేసులో ఉన్నార‌ట‌. దీంతో కావ‌లి ఐవ‌సీపీలో సాగుతున్న మూడు ముక్క‌లాట‌లో విజేత ఎవ‌ర‌న్న‌ది అటు కేడ‌ర్‌లోను చర్చ‌నీయాంశంగా మారింద‌ట‌.

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్‌రెడ్డి విజ‌యం కోసం విష్ణువ‌ర్ధ‌న్‌, వేణుగోపాల్ ఇద్ద‌రూ ప‌నిచేశారు. కానీ, ఈ సారిమాత్రం తాము బ‌రిలోకి ద‌గాల‌ని వారిద్ద‌రూ రెడీ అయ్యార‌ట‌. అటు Jagan చేయించిన స‌ర్వేల్లో ప్ర‌తాప్‌కు వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని పార్టీలో చ‌ర్చ సాగుతుంద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు ఛాన్స్ ఇస్తే గెలిచి చూపిస్తాన‌ని వేణుగోపాల్ అధిష్టానం వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌. ఇక గ‌త ఎన్నిక‌ల‌వేళ‌నే ప్ర‌తాప్‌కు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డికి మ‌ధ్య ఒక ఒప్పందం కుదిరింద‌ట‌. 2019 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని అందుకు ఇష్ట‌మైతేనే ఈ ఎన్నిక‌ల్లో నీ విజ‌యం కోసం ప‌నిచేస్తాన‌ని విష్ణువ‌ర్ధ‌న్ చెప్పార‌ట‌. అందుకు ప్ర‌తాప్‌రెడ్డి కూడా సై అన్నార‌ట‌.

అయితే, ఇప్పుడు ప్ర‌తాప్ కుమార్‌రెడ్డి మాట త‌ప్పార‌న్న‌ది విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మాట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ నాకు ఖాయ‌మంటే.. నాకు ఖాయ‌మ‌ని విష్ణువ‌ర్ధ‌న్‌, వేణుగోపాల్ ప్ర‌చారం చేసుకుంటున్న నేప‌థ్యంలో ప్ర‌తాప్ కూడా ఏ మాత్రం కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌ట‌. టికెట్ విష‌యంలో Jagan స్వ‌యంగా త‌న‌కు హామీ ఇచ్చారని మిగిలిన వారు ఏం చెప్పినా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కార్య‌క‌ర్త‌ల‌క తేల్చి చెబుతున్నారు.

ఇలా ముగ్గురు నేత‌లు కూడా కావ‌లి టికెట్ మాదేనంటూ ప్ర‌చార ప‌ర్వానికి తెర తీయ‌డంతో ఎవ‌రి గ్రూప్‌లో కొన‌సాగాలో అర్ధంకాక కేడ‌ర్ త‌ల‌లు ప‌ట్టుకుంటుంద‌ట‌.

కావ‌లి హైక‌మాండ్ కావ‌లి టికెట్ ఎవ‌రికి అన్న అంశంపై క్లారిటీ ఇస్తేకానీ పార్టీలో టికెట్ వార్‌కు తెర‌ప‌డుతుంద‌ని ప్ర‌త్య‌ర్ధితో ఎన్నిక‌ల స‌మ‌రానికి అంతా రెడీ అవుతార‌న్న‌ది కార్య‌క‌ర్త‌ల మాట‌. అయితే, ఈ విష‌యంలో Jagan ఎప్పుడు క్లారిటీ ఇస్తారో ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌న్న‌ది మాత్రం అటు లీడ‌ర్‌ల‌కు, ఇటు కేడ‌ర్‌కు అంతుప‌ట్ట‌డం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఉన్న ముగ్గురిలో ఎవ‌రికి టికెట్ కేటాయించినా మిగిలిన ఇద్ద‌రూ వైసీపీకి రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా కొన‌సాగుతోంది.

Related News