Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ జ‌గ‌న్‌పై తాజా స‌ర్వే.. ఏపీ ప్ర‌జ‌లు ఏం తేల్చారు..?

Category : politics

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైకాపా అధినేత అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు ప్ర‌శాంత్ కిశోర్ వంటి ఎన్నిక‌ల స్పెష‌లిస్ట్‌ల‌ను పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వాహ‌కుడిగా నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌శాంత్ కిశోర్ ఇది వ‌ర‌కు ప‌ని చేసిన పార్టీల ఫ‌లితాన‌లు నిక్క‌చ్చిగా చెప్పారు. ఆ న‌మ్మ‌కంతోనే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిశోర్‌ను పార్టీ వ్య‌వ‌హారాలను చూసుకునేందుకు నియ‌మించుకున్నారు. అంతేకాకుండా, ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ చేత ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తూ, వాటి ఫ‌లితాల ఆధారంగా కార్య‌క్ర‌మాల్లో మార్పులు, అలాగే, నేత‌లు, నాయ‌కుల మార్పులు చేసుకుంటూ వ‌చ్చారు వైఎస్ జ‌గ‌న్‌.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల శ్రీ‌కాకుళం, విజ‌యన‌గ‌రం జిల్లాల‌ను అత‌లాకుత‌లం చేసిన తిత్లీ తుఫాన్‌, అలాగే త‌న‌పై కోడిక‌త్తితో దాడి ఘ‌ట‌న వంటి రెండు అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఎటువంటి అభిప్రాయ‌ముంద‌నే స‌మాచారాన్ని త‌న‌కు స‌ర్వే రూపంలో అందించాల‌ని ప్ర‌శాంత్ కిశోర్‌ను ఆదేశించారు జ‌గ‌న్‌. పార్టీ అధినాయ‌కుడి ఆదేశం మేర‌కు త‌న టీమ్‌తో స‌ర్వే చేయించిన ప్ర‌శాంత్ కిశోర్‌ ఆ నివేదిక‌ను జ‌గ‌న్‌కు అంద‌జేశారు.

అయితే, ప్ర‌శాంత్ కిశోర్ అంద‌జేసిన ఆ నివేదిక‌ను చూసిన జ‌గ‌న్‌కు ఒకింత షాక్‌కు గుర‌య్యారు. స‌ర్వే సంద‌ర్భంగా ప్ర‌జ‌లు చెప్పిన అభిప్రాయాలు అలా ఉన్నాయి మ‌రీ..! తిత్లీ తుఫాన్‌తో నిలువెల్లా న‌ష్ట‌పోయిన విజ‌యన‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల ప్ర‌జ‌ల గురించి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ ఒక్క‌టంటే.. ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌క‌పోవ‌డాన్ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. తుఫాన్ కార‌ణంగా తాము 25 ఏళ్ల వెన‌క్కు వెళితే.. వైఎస్ జ‌గ‌న్ క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశార‌ని ప్ర‌శాంత్ కిశోర్ త‌న స‌ర్వేలో పేర్కొన్నారు.

ఇక‌, జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో హ‌త్యాయ‌త్నం గురించి ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని తెలియ‌స్తూ, ఆ ఘ‌ట‌న ప‌క్కా వైసీపీ ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా, వారు అలా అభిప్రాయ‌ప‌డ‌ట‌నికి గ‌ల కార‌ణాన్ని కూడా వివ‌రించారు. ఏ వ్య‌క్తి అయినా, త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంద‌న్న అనుమానం ఉంటేనే పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తాడ‌ని, అటువంటిది జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగినా కూడా తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా, క‌నీసం చికిత్స కూడా చేయించుకోకుండా హైద‌రాబాద్‌లోని త‌న సొంత ఇంటికి వెళ్ల‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు.

కనీసం, వైసీపీ నేత‌లు సైతం ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డాన్ని వారు సర్వేలో పేర్కొన్నారు. ఇలా జ‌గ‌న్ త‌న ప్లాన్‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌ని ప్ర‌జ‌లు చెప్పారు. ఇలా తిత్లీ తుఫాన్‌, కోడిక‌త్తి ఘ‌ట‌న వంటి కార‌ణాలే కాకుండా.. ఇంకా ప‌లు కార‌ణాల‌తో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో త‌న గ్రాఫ్‌ను మ‌రింత దిగ‌జార్చుకున్నాడ‌న్న అంశాన్ని ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే తేల్చింది. మొత్తానికి 2014లో 42 శాతంగా ఉన్న జ‌గ‌న్ గ్రాఫ్ 2018 నాటికి 26 శాతానికి ప‌డిపోయిందని ప్ర‌శాంత్ కిశోర్‌ స‌ర్వే పేర్కొంది.

Related News