//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేత‌ల మ‌ధ్య విబేధాలు తారాస్ధాయికి చేరుకున్నాయి అని తెలుస్తుంది.రాష్ట్రం లోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు నడుస్తుంది . పోయిన ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని చేజార్చుకున్న జగన్ , ఈసారి ఎలా అయిన అధికారాన్ని అందుకోవాలని ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తున్నాడు

ఈ తరుణం లో జగన్ కి వైసీపీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌డుతున్న నేప‌థ్యంలో జిల్లాలోని వైసీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వైసీపీ విశాఖ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువుని బజారుకీడ్చుతున్నారు. విశాఖ జిల్లాలో పాద‌యాత్ర చేప‌డుతున్న జ‌గ‌న్‌కుపార్టీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి.

పార్టీ నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల విశాఖ లో జగన్ పాదయాత్ర కి అంతగా పాపులారిటీ రావటం లేదు అని తెలుస్తుంది. తాజాగా వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి స‌మ‌క్షంలోనే విశాఖ జిల్లాకు చెందిన‌ వైసీపీ నేత‌లు ఒకరిపై ఒక‌రు విరుచుకుప‌డ్డారు.

జగన్ పాదయాత్ర సందర్భంగా సమావేశం నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సమన్వయకర్త కన్నబాబురాజు, నియోజ‌క‌వ‌ర్గ మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మ‌ధ్య విబేధాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. విజ‌య‌సాయిరెడ్డి స‌మ‌క్షంలో ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల దాడికి దిగారు.

ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న విజ‌య‌సాయిరెడ్డి, నేత‌ల‌పై మండిప‌డ్డాడు. విబేధాలు వీడి పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ప‌నిచేయాల‌ని కోరారు. మొత్తానికి పాద‌యాత్ర చేపడుతున్న త‌రుణంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు జ‌గ‌న్‌ను కలవరపెడుతున్నాయి . ఎందుకు అంటే వైసీపీ అధికారం లోకి రావాలి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా కీలకం కానున్నాయి .